గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కు వినతి పత్రం

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 4 బోధన్ నియోజక వర్గంలో గత 70సం.రాల నుండి ఇప్పటి వరకు ఎన్ని సార్లు ఎన్నికలు జరిగినప్పటికి కనీసం ఒక్క సారి కూడా లంబాడి సామాజిక వర్గానికి ఇప్పటి వరకు గౌరవ ప్రదమైన పదువులు అయింటువంటి ఎంపీపీ గాని, బోధన్ మునిసిపల్ చైర్మన్ గాని అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ లాంటి గౌరవ ప్రదమైన పదువులు లంబాడి వర్గానికి కేటాయించక పోవడం సామాజిక అసమానత చూపడమే. ఎందుకంటే ఇప్పటి వరకు ఎస్టి సామాజిక వర్గం మినహా మిగితా అన్నీ వర్గాలకు అవకాశం కలిపించడం జరిగింది. కావున శనివారం గిరిజన విద్యార్తి సంఘం, నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యములో సబ్ కలెక్టర్ కు విన్నవించుకుంటూ కనీసం ఒక్క సారి అయిన ఎస్టి సామాజిక వర్గానికి ఇలాంటి ప్రదమైన పదవులకు అవకాశం కల్పించి, భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల స్ఫూర్తితో జనాభా ప్రతిపాధికన బోధన్ మున్సిపల్ ఎన్నిజాలలో కౌన్సిలర్ స్థానాల సంఖ్య పెంచాలని అలాగే రాబోవు ఎంపిటిసి జెడ్పిటిసి మరియు బోధన్ మున్సిపల్ చైర్మన్,మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో ఎస్టి లంబాడి సామాజిక వర్గానికి కేటాయించి సామాజిక సామన్యాయం చేసి మా లంబడి సామాజిక వర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు జాదవ్ ప్రవీణ్ నాయక్ ప్రధాన కార్యదర్శి కోర్ర బంతిలా నాయక్ బోధన్ పట్టణ గిరిజన విద్యార్థి సంఘ నాయకులు బాధవత్ శ్రీనివాస్ నాయక్ మరియు జాదవ్ అనిల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు