గ్రంథాలయ సెస్ చెల్లించండి కమిషనర్ కు వినతి

పయనించే సూర్యుడు న్యూస్, జనవరి03(ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ):తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పాలంకి నాగరాజు శనివారం ఏలేశ్వరం నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ పి.సూర్యప్రకాష్ ని కలిసి జిల్లా గ్రంథాలయ సంస్థ కు చెల్లించ వలసిన సెస్ బకాయిలు చెల్లించ వలసినదిగా కోరారు.సుమారు 50,00000/- వరకు బకాయిలు ఉన్నాయని వివరించారు. బకాయలలో కనీసం 2500000/-చెల్లించ వలసినదిగా విజ్ఞప్తి చేశారు. సిబ్బంది జీతాలకు ఇబ్బంది ఉన్నందున త్వరితగతిన సెస్ బకాయిలు చెల్లించ వలసినది గా వినతి పత్రం సమర్పించారు. దీనిపై కమీషనర్ సానుకూలంగా స్పందించి సిబ్బందితో చర్చించి సెస్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం గ్రంథపాలకుడు కవికొండల సత్యనారాయణ ఆయనతో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *