పయనించే సూర్యుడు జనవరి 4 చందూర్ మండల్ రిపోర్టర్ చందూర్ మండలం లోని ప్రధాన బస్టాండ్ నుండి నిజాంసాగర్ కెనాల్ వరకు రోడ్డు వెడల్పు, రోడ్డుకు ఇరు వైపుల నూతన డ్రైనేజీ నిర్మించడంపై స్థానిక గ్రామపంచాయతీ నందు గ్రామ సభ నిర్వహించారు. ఈసమావేశంలో రోడ్డుకు రెండువైపులా 30/30 ఫీట్ల తో వెడల్పు, డ్రైనేజీ నిర్మాణం చేయడానికి తీర్మానం ప్రవేశపెట్టగా మెజారిటీ ప్రజల అభిప్రాయం కొరకు గ్రామ సభ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు అన్ని కుల సంఘాల పెద్దలు, యువకులు స్థానిక సర్పంచ్, గ్రామపంచాయతీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.