చేజర్ల మండలంలో మంత్రి ఆనం పర్యటన

పయనించే సూర్యుడు జనవరి 4 ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య చేజర్ల మండలంలోని పెరుమళ్ళపాడు గ్రామంలో ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ బుక్ పంపిణీ కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గం సీనియర్ టిడిపి నాయకులు, కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు ఆర్డీవో పాల్గొంటారు. చేజర్ల మండలంలోని కూటమి తెలుగుదేశం బిజెపి,జనసేన నాయకులు రైతులు ప్రజలు ప్రింట్ ఎలెక్ట్రానిక్ మీడియా మిత్రులు తప్పుకుండా హాజరుకావాలని శనివారం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్.సిరాజుద్దీన్ తెలిపారు