పయనించే సూర్యుడు జనవరి 4 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం హై స్కూల్‌లో చేజర్ల మండల రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ గ్రూపింగ్ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేజర్ల ఎం.ఈ.ఓ జి. ఇందిర హాజరయ్యారు. హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రావణ్ కుమార్ . ఎస్‌బీఐ మేనేజర్ సురేంద్ర . బీజేపీ ప్రధాన కార్యదర్శి తేళ్ల ప్రతాప్ రెడ్డి రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఎం.ఈ.ఓ రక్తదాన ప్రాముఖ్యత, బ్లడ్ గ్రూపులపై వివరించారు. సుమారు 350 మంది విద్యార్థుల రక్త నమూనాలు సేకరించి బ్లడ్ గ్రూపులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్‌తో పాటు విజ్ఞాన్ జూనియర్, డిగ్రీ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.