పయనించే సూర్యుడు న్యూస్ :పెద్దపల్లి, జనవరి-04: పెద్దపల్లి జిల్లాలో అర్హులైన 2 చేనేత కార్మికులకు 2 లక్షల రుణమాఫీ సొమ్ము ప్రభుత్వం విడుదల చేసిందని కరీంనగర్ చేనేత జౌళి. శాఖ సహాయ సంచాలకులు జి.రాఘవ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఏప్రిల్ 01,2014 నుంచి మార్చి 31,2024 వరకు చేనేత కార్మికుల సంక్షేమం సంబంధించి వర్కింగ్ క్యాపిటల్ నిమిత్తం వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం చేనేత రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. పెద్దపెల్లి జిల్లాలో శ్రీవెంకటేశ్వర సహకార సంఘం కనుకులకు చెందిన 2 చేనేత కార్మికులు రెండు లక్షల రూపాయలను చేనేత రుణమాఫీ కొరకు కలెక్టర్ ప్రతిపాదన పంపగా ప్రభుత్వం వాటిని పరిశీలించి రెండు మంది చేనేత కార్మికులకు రెండు లక్షల రూపాయల చేనేత రుఢ మాఫీ నిధులను కార్మికుల బ్రాంచ్ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.