పయనించే సూర్యుడు గాంధారి 04/1/26 గాంధారి మండల కేంద్రంలో చికెన్ షాప్ నడుపుతున్న మహమ్మద్ అహ్మద్ యొక్క ఇంటి నందు ప్రభుత్వం నిషేధించబడిన చైనా మాంజదారం అమ్ముతున్నారని సమాచారం మేరకు గాంధారి ఎస్ఐ మరియు సిబ్బందితో కలిసి అతని ఇంట్లో సోదా చేయగా ప్రభుత్వ నిషేధించబడిన మంజ చరకాలను స్వాధీనపరుచుకొని వాటిని అమ్ముతున్న మహమ్మద్ అహ్మద్ పై కేసు నమోదు చేయటం జరిగింది. ప్రాణాంతకమైన చైనామంజ ఎవరైనా అమ్మినట్టైనా, ఎవరైనా నిల్వలు పెట్టుకున్నా అట్టి వారి పై న కేసు లు చేసి కఠిన చర్యలు తీసుకోబడును అని ఎస్సై ఆంజనేయులు తెలిపారు