పయనించే సూర్యుడు జనవరి 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ షాద్ నగర్ మున్సిపాలిటి పరిధిలోని సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన భక్త బృందం సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ శ్రీరామ జయరామ, జయ జయ రామ నినాదాలతో ఆట పాటలతో, భజనలతో భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. భక్తి పాటలు భజనలతో ఆలయంలో శ్రీ రామ నామస్మరణతో మార్మోగింది. ఆలయ ప్రధాన అర్చకులు రఘుపతిరావు, రాఘవేంద్రాచార్య, అర్చకులు కృష్ణ, ప్రమోద్, సునీల్ పంతులు ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పౌర్ణమి పురస్కరించుకుని దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. అదేవిధంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్లను భక్తులకు పంపిణీ చేశారు. అన్నారం గ్రామ సర్పంచ్ చేదురువల్లి లావణ్య రామకృష్ణ, మరియు కాంగ్రెస్ నాయకులు రఘు గౌడ్ ఆధ్వర్యంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయ ఆవరణలో అయ్యప్ప స్వాములకు, భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారిని దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువా పూలమాలలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పులిమామిడి శ్రీశైలం గౌడ్, ఎంసాని నర్సింలు, జి.వసంతరావు, అన్నారం రఘు గౌడ్, గడ్డమీద రమేష్, శంకర్ గౌడ్, యాదగిరి, రఘునందన్ రెడ్డి, క్యూసెట్ శ్రీనివాస్, సుప్ప నర్సింలు, నారాయణ, వీర్లపల్లి కృష్ణయ్య, శంకరయ్య, వీఆర్వో బచ్చన్న, సుప్ప కృష్ణయ్య, పి.ప్రవీణ్ గౌడ్, పద్మా వెంకటేష్, జగన్, గోరియా నాయక్, కొత్త సత్తయ్య గౌడ్, శ్రీనివాస్, రమేష్, రవి, హనుమంత్ రెడ్డి, రవీందర్, నరసింహులు, మాజీ వార్డు సభ్యులు సింగపాగ లక్ష్మయ్య, భజన భక్త బృందం మహిళలు తదితరులు పాల్గొన్నారు..