జగ్గంపేట గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలు, నగదు పంపిణీ

★ 40 మంది సిబ్బందికి రూ.600 చొప్పున అందజేత

పయనించే సూర్యుడు జనవరి : 4 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలు, నగదు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ సెక్రటరీ శివ, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 40 మంది సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.600 నగదు తో పాటు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి మండల టీడీపీ అధ్యక్షుడు జీనుమణిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌వీఎస్ అప్పలరాజు, టౌన్ టీడీపీ అధ్యక్షుడు పాండ్రంగి రాంబాబు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు దేవరపల్లి మూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జీనుమణిబాబు, ఎస్‌వీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ దేశ ప్రగతికి పంచాయతీలే పునాదులని తెలిపారు. కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ నాయకత్వంలో గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, జగ్గంపేట గ్రామపంచాయతీని మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు స్థానిక నాయకులు సమిష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు. నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా గ్రామపంచాయతీ అన్ని విభాగాల సిబ్బందికి ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, బండారు రాజా, రాయి సాయి, పీలా మహేష్, నలమాటి ఆనంద్, వైభోగుల కొండబాబు యాదవ్, సాంబత్తుల చంద్రశేఖర్, కోడూరి రమేష్, బండారు నాని, ముక్కాపాల బాబు, చేలికాని హరిగోపాల్, మొరుకుర్తి రాజు, వాకారెడ్డి, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది నాయకులు పాల్గొన్నారు.