జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కోరపల్లి విద్యార్థిని ఎంపిక

పయనించే సూర్యుడు: జనవరి 4: హుజురాబాద్ టౌన్ రిపోర్టర్ దాసరి రవి: గత నెల 27వ నుండి తేదీ 29 డిసెంబర్ వరకు మిని స్టేడియం నారాయణపేట జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ - 14 బాలికల హ్యాండ్ బాల్ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోరపల్లి విద్యార్థిని పింగళి అక్షర( 7వ తరగతి) జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు జి. శ్రీను,ప్రధానోపాధ్యాయులు కేతీరి శ్రీనివాసురెడ్డి తెలిపారు.ఈ పోటీలకు ఎంపికైన విద్యార్థిని తేదీ 05/01/2025 నుండి 09/01/2025 వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని చిత్తూరునగర్ లో జరిగే జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో పాల్గొననున్నరని పేర్కొన్నారు. విద్యార్థుల ఎంపిక పట్ల జమ్మికుంట మండల ఎంఈఓ హేమలత, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ బండారి రజిత, సర్పంచ్ కందికుంట్ల మధుసూదన్, ఉప సర్పంచ్ రాజు యాదవ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ ప్రజలు అభినందించారు.