
పయనించే సూర్యుడు న్యూస్ 04-1-26, నాగరాజు రుద్రారపు సూర్యాపేట టౌన్ రిపోర్టర్ ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడం ఆర్టీసీ డ్రైవర్ల విధి.. సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు కార్యక్రమం పురస్కరించుకుని శనివారం రోజున సూర్యాపేట పట్టణంలో గల ఆర్టీసీ బస్టాండ్ డిపో నందు బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు, ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్, సూర్యాపేట రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాల్సిన బాధ్యత ఆర్టీసీ డ్రైవర్ల పై ఉన్నదని డిఎస్పి తెలిపారు. నిబంధన ప్రకారం వాహనాలను నడపాలని అతివేగంగా వెళ్లకుండా నిదానంగా వెళ్లాలని సూచించారు, ఆర్టీసీ సిబ్బందితో వాహనాలను జాగ్రత్తగా నడుపుతామని ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు ప్రమాదాల నివారించడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వాహనాలు నిదానంగా నడపాలని, పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని కోరారు, రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు. రోడ్డు ప్రమాదంలో ఏ ఒక్క వ్యక్తి మరణించకూడదని ఇందుకోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా వాహనాలు నడపాలని కోరారు. కార్యక్రమం నందు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ రెడ్డి, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జాన్ రెడ్డి, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం ఉన్నారు.