జిల్లా పరిషత్ హై స్కూల్ బాలికల పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు, 04 జనవరి 2026 భీంగల్ మండల ప్రతినిధి కొత్వాల్ లింబాద్రి , నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణంలో జిల్లా పరిషత్ హై స్కూల్ బాలికల పాఠశాల యందు భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భీంగల్ మండల ఎంఈఓ స్వామి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సావిత్రిబాయి పూలే జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జాన్ విల్సన్, రాజేశ్వర్, సాగర్, భూమేశ్వర్, రాజేందర్, రమణ, శివకుమార్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.