పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 04.01..2026 (మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 చౌడే పల్లె మండల ప్రతినిధిJ. నాగరాజ) చౌడేపల్లె మండలంలోని దుర్గ సముద్రం పంచాయతీ గాండ్ల పల్లె గ్రామంలో విరాజిల్లుతున్నభక్తులు కోరిన కోరికలు తీర్చే100 సంవత్సరాలచరిత్ర కలిగిన అతి పురాతనమైన శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవస్థానంలో పౌర్ణమి శుభ శనివారంసందర్భంగా వి. గిరినాథ్ ప్రకాష్ రమణయ్య సరస్వతి సుబ్రహ్మణ్యం గాండ్ల పల్లె వాస్తవ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలోవిశేష పూజలు నిర్వహించారు ఉదయం 6 గంటలకు ఆలయం అర్చకుడు జె. వెంకటరమణ అర్చకత్వమునఆలయం లోపలనీటితో శుద్ధపరిచి గడపలకు గుమ్మాలకు పసుపు కుంకుమ సింధూరంతో బొట్లు పెట్టి మామిడి ఆకుల తోరణాలు కట్టి స్వామి వారి విగ్రహాన్ని నీటితో శుద్ధపరిచి పసుపు కుంకుమ సింధూరంతో బొట్లు పెట్టి ప్రత్యేకమైన రంగురంగులపూలతో అలంకరించి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో పూజించారు పాలు పెరుగు నెయ్యి ఆపిల్ పండ్లు అరటి పండ్లు దానిమ్మ పండ్లు ద్రాక్ష పండ్లు మిశ్రమంతో పంచామృతం చేసి దేవదేవునికి నైవేద్యంగా పెట్టి అభిషేకము వస్త్రాలంకరణ అష్టోత్రము ఆకు పూజ హనుమాన్ చాలీసా శ్రీ హనుమాన్ భుజంగ స్తోత్రం వంటి వి పారాయణం చేసిప్రత్యేక పూజలు నిర్వహించారు దేవునికి నెయ్యి దీపాలు వెలిగించి అగరవత్తులు వెలిగించితమలపాకులతో ఆకు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు ఇచ్చి భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించి ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి ఎంతో శక్తివంతుడని భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఇష్టదైవమని ఆయనకు తమలపాకుల దండ సింధూరం సమర్పించిన భక్తులకు ఎలాంటి కష్టాలు దరిచేరవు అని భక్తుల విశ్వాసం అలాంటి స్వామివారి సేవలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు అన్నారు భక్తులకు తీర్థ ప్రసాదములు పంపిణీ చేశారు జై హనుమాన్ జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ గోవింద నామస్మరణలతో ఆలయంలోపల భక్తుల నినాదాలతో ఆలయం కిటకిటలాడింది తరువాత సాయంత్రం 7 గంటలకు పూలమాలలు వడ మాలలు వేసి స్వామివారికిఅర్చన చేశారుఈ పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున ఉచిత అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ ధనుర్మాసం పౌర్ణమి సందర్భంగా గాండ్లపల్లె ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో తులతూగాలని లోకం సుభిక్షంగా ఉండాలని భక్తాదులు శ్రీ అంజన్నను వేడుకున్నారు