డా‌.పీవీ రంగారావు బాలికల గురుకుల పాఠశాల/కళాశాలకు పర్నీచర్ అందజేసిన పి.వి‌.ప్రభాకర్ రావు

పయనించే సూర్యుడు జనవరి 4 ఎన్ రజినీకాంత్:- భారతరత్న మాజీ ప్రధాని దివంగత మాజీ ప్రధాని పి.వి.స్వస్థలం వంగర గ్రామంలోని డా.పి.వి.రంగారావు బాలికల గురుకు పాఠశాల/కళాశాల సైన్స్ లాబ్స్ కు గాను పి.వి.గ్లోబల్ పౌండేషన్ చేర్మన్ పి.వి.ప్రభాకర్ రావు 7O వేల విలువైన పర్నీచర్ అందజేశారు. గత డిసెంబర్ లో వ్యక్తిగత పనుల నిమిత్తం వంగర గ్రామానికి వచ్చి అయన సోదరి యంయల్సీ సురభి వాణి దేవి,పి.వి‌.సోదరుల కుమారులు పి.వి .శరత్ పి.వి.మదన్ మోహన్ తో పాటు ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా వంగరలో పాఠశాల ఏర్పాటుకు గల కారణాలు తెలిపారు.. దేశ ప్రధానిగా తమ తండ్రి పి.వి‌. వున్న సమయంలో రాష్ట్రంలో డా.రంగారావు విద్యా మంత్రిగా పని చేశారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలనే సంకల్పంతో ఈ ఆశ్రమ పాఠశాల ప్రారంభమైందని గత 30 సంవత్సరాలుగా అనేక మంది ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దిన సంగతి గుర్తు చేశారు. అనేక రంగాలలో ఉన్నత స్థానాలలో కొనసాగుతున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా స్వంత భూమిని భవనాలకు అందజేశారని డా.రంగారావుకు ఆశ్రమ పాఠశాల మానస పుత్రికగా ఉదహరించారు. పి.వి‌.నరసింహారావు ఏ విధంగా పేరు సాధించారో విద్యార్థులు కూడా అదే పేరు పొందాలని కోరారు. పాఠశాల ప్రిన్సపాల్ సుల్తానా, ఉపాధ్యాయిని భార్గవి ప్రభుత్వం ద్వార తమకు ప్రయోగశాల కొరకు గాను పరికరాలు అందినప్పటికి పర్నిచర్ లేనందున ఉపయోగ పడని అంశాన్ని ప్రభాకర్ రావు ద్రుష్టికి తేగా పర్నిచర్ అందచేందుకు హామి యిచ్చి డెబ్బై వేల విలువైన పర్నిచర్ అందచేశారు. పాఠశాలకు ఫర్నీచర్ అందించిన ఆయనకు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, సర్పంచ్ సృజన రమేశ్, ఉపసర్పంచ్ ఒల్లాల రమేశ్, మార్కెట్ కమిటి డైరెక్టర్ వెంకటరెడ్డి, బుచ్చిరెడ్డి, సతీష్, అశోక్, తిరుపతి రెడ్డి, లక్ష్మీకాంతరావు, చంద్రారెడ్డి ,సతీష్ రెడ్డి క్రుతజ్ఞతలు తెలిపారు.