పయనించే సూర్యుడు జనవరి 04,(చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలం తిరుమలాపురం గ్రామంలో జాతీయ సేవా పథకం రెండవ రోజు శిబిరం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు, అనంతరం జాతీయ మహిళా దినోత్సవం మొట్టమొదటి ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్ పిఓ జి. మల్లయ్య మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జ్యోతిబాపూలే సహకారంతో విద్యలభ్యసించారని అదేవిధంగా సమాజంలో బడుగు బలహీన వర్గాలం బాలికల విద్య కోసం కృషి చేశారని, వారు అనేక వివక్షతలు ఎదుర్కొన్నారని అయినా కానీ మహిళల విద్య కోసం పాటుపడిన గొప్ప సాంఘిక సంస్కర్తలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకురాలు ఉష, యశోద, యుపిఎస్ హెచ్ఎం ఎస్. స్వాతి నీ సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటరెడ్డి, శ్రీనివాసరావు, రాంబాబు, వేణుగోపాల్ పాల్గొన్నారు. సాయంత్రం ఖమ్మం జిల్లా మిషన్ కోఆర్డినేటర్ ఎస్డి. సమ్రీన్ ఉమెన్ ఎంపవర్మెంట్ బేటి బచావో-బేటి పడావో పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రస్తుత సమాజంలో బాలురుతో పాటు బాలికలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా పెడదారులు పడుతున్నారని ఆడపిల్లలు ముఖ్యంగా అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోతున్నారని, ఈ వయసులో తల్లిదండ్రుల మాటలు గౌరవించి జాగ్రత్తగా సమాజంలో మెలగాలని అదేవిధంగా చదువుపై దృష్టి సారించాలని వివరించారు. పని ప్రదేశంలో కూడా ఎవరైనా వేధింపులకు గురి చేస్తే హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయాలని , జిల్లాస్థాయిలో ఒక టీం ఉంటుందని ఈ నెంబర్ కి కాల్ చేసిన వెంటనే రక్షించబడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలాపురం ఉపసర్పంచ్ జి. నాగమణి, వార్డు మెంబర్లు విజయ అరుణ, సిహెచ్. మధు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
