పయనించే సూర్యుడు జనవరి 4 కరీంనగర్ న్యూస్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి డివిజన్ నెం.2 ప్రాంతంలో ప్రభుత్వ భూములు అక్రమంగా కబ్జాకు గురవుతున్నాయని కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్ –2 కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలగాని అనిల్ గారు ఆరోపించారు ఈ మేరకు ఆయన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు సర్వే నెం.120లో గతంలో ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగుల కోసం లే–అవుట్ రూపొందించి ఇండ్ల స్థలాలు కేటాయించిందని ఇందులో పాఠశాల టౌన్ హాల్ గుడి మసీదు చర్చి పార్క్‌లకు ప్రత్యేకంగా భూములు కేటాయించినట్లు తెలిపారు అయితే ప్రస్తుతం పాఠశాల పార్క్‌కు కేటాయించిన భూములు అక్రమంగా ఆక్రమణకు గురై అపార్ట్మెంట్లు, నివాస గృహాలు నిర్మించినట్లు ఆయన పేర్కొన్నారు ఇంకా అదే సర్వే నెంబర్ లో మిగిలి ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుని,ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు ఇందుకు సంబంధించి లే–అవుట్ ప్లాన్ ఫోటో ఆధారాలను కమిషనర్‌కు సమర్పించినట్లు తెలిపారు