
పయనించే సూర్యుడు జనవరి 4 (గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ: వేములవాడ అర్బన్ మండలం కేంద్రంలోని చింతలఠాణ గ్రామంలోని ప్రీ ప్రైమరీ స్కూల్ లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బత్తుల మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది, అనంతరం మహిళ ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది, మరియు విద్యార్థులకు స్వీట్స్ పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బత్తుల మహేందర్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే, సమాజం కోసం మంచి చేద్దాం అనుకునే ప్రతి ఒక్కరు కూడా నడిచేది ముళ్ళ బాటలోనే, సాటి వారి కోసం బ్రతికే వారు చేయాల్సింది ఆ ఒంటరి ప్రయాణమే, ఆ ఒంటరి ప్రయాణంలో చిత్కారాలు లెక్కలేనన్ని అవమానాలు, అయినా అనుకున్నది సాధించాలని అనే ఆశ హనువంతైనా తగ్గదు నర నరాల్లో ఎగిసిపడే ప్రతి రక్తం కణం ఉద్యమం వైపే నడిపిస్తుంది, పేదలకు మంచి చేయాలని ఆమె ఆకాంక్ష కోట్లాది గుండెల్లో కొలువైన దేవత గా నిలిచిపోయేలా చేసింది, ఎన్నో రకాల ఒడిదొడుకులు ఎదుర్కొంటూ మహిళలని చైతన్యం కలిగించి ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపిన సంఘసంస్కర్త భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే చరిత్ర నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని వారి జీవిత చరిత్ర, తెలుసుకోవలసిన అవసరం ఉందని గుర్తు చేశారు, ఆమె శ్రీమతి సావిత్రిబాయి ఫూలే. అట్టడుగు వర్గాల, మహిళల హక్కులు నిరాకరించబడిన దేశంలో ఆనాటి కట్టుబాట్లను, సాంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను దిక్కరించిన భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి అణగారిన వర్గాల మాతృమూర్తి శ్రీమతి సావిత్రిబాయి ఫూలే. విద్య ద్వారానే స్త్రీ జాతి విముక్తి సాధ్యమని బలీయంగా నమ్మి దేశంలో మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించింది. పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడి, కుల వ్యవస్థ పునాదులను పెకలించి శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాడటం సామాజిక బాధ్యతగా స్వీకరించిన ధీశాలి. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బత్తుల మహేందర్ యాదవ్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వేములవాడ అర్బన్ మండల అధ్యక్షులు పార్వతి మహేష్ గౌడ్ చొక్కాల ప్రశాంత్ లింగంపల్లి రమేష్ గడ్డి ప్రశాంత్ వల్లపు రాజు, బీసీ నాయకులు పాల్గొన్నారు.