నవభూమి, మన తెలంగాణ క్యాలెండర్లు ఆవిష్కరించిన డి.ఎస్.పి సతీష్ కుమార్

పయనించే సూర్యుడు, జనవరి 04, బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ డీఎస్పీ కార్యాలయంలో నవభూమి, మన తెలంగాణ సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్లను డిఎస్పి సతీష్ కుమార్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక చైతన్యానికి, ప్రజల్లో అవగాహన పెంపుకు మీడియా సంస్థలు చేస్తున్న సేవలు ఘనీయమని పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కృషి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సి.ఐ సతీష్ పాల్గొని మాట్లాడారు. అనంతరం బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో ఎం.పీ.డీవో జమలాకర్ రెడ్డి చేతుల మీదుగా నవభూమి, మన తెలంగాణ క్యాలెండర్లు ఆవిష్కరించారు. జమలాకర్ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక వార్తా సంస్థలు ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తూ సమాజానికి అద్దం పట్టే విధంగా పని చేయడం గర్వకారణమని అభినందించారు.తదుపరి కార్యక్రమంలో ఎస్‌.ఐ మేడ ప్రసాద్, అదనపు ఎస్‌.ఐ నాగబిక్షం ఆధ్వర్యంలో క్యాలెండర్లను ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా పత్రిక ప్రతినిధులు, స్థానిక పాత్రికేయులు అధికారులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సారపాక నూతన ప్రెసిడెంట్ కిషోర్ శివరామ్ నాయక్ కూడా నవభూమి, మన తెలంగాణ క్యాలెండర్లు ఆవిష్కరించి ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ అనునిత్యం ప్రజా క్షేత్రంలో అంకితభావంతో పనిచేస్తూన్న మీడియా మిత్రులను ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎడారి రమేష్, బిట్ర సాయి బాబా, శనగ మల్లేష్, రవికుమార్, గోనెల సతీష్ కుమార్, నరసింహరావు, ప్రసాద్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.