పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 4 బోధన్ పట్టణం ఆటోనగర్ కు చెందిన నిరుపేద విద్యార్థికి శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ శ్రీహరి సేవ వారు మల్టిపుల్ జి ఎం టి మరియు పి డిజి లయన్ పి.బసవేశ్వర రావు చేతుల మీదుగా సైకిల్ ను అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థికి సైకిల్ అందజేయడం అభినందనీయమని ఆయన అన్నారు. లయన్స్ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ తన్నీరు సుబ్బారావు,సెక్రెటరీ శ్రీనివాసరావు,ట్రెజరర్ నవిత, నాగేశ్వరరావు, పావులూరి వెంకటేశ్వరరావు సురా బత్తుని శ్రీనివాసరావు, శ్రీనివాస్, వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.