నూరు సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ

* ప్రజా ఉద్యమాల ద్వారా వేల సమస్యలు పరిష్కారం * పేదల పాలిట పెన్నిధి సి పి ఐ * ఎన్ టీ ఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్

పయనించే సూర్యుడు 04-12-2026 రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు జగ్గయ్యపేట నియోజకవర్గం గ్రామంలో ని ఈరోజు న భారత కమ్యూనిస్టు పార్టీ నూరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల ముగింపులో భాగంగా మండల కేంద్రమైన పెనుగంచిప్రోలు లోని కర్ల లింగయ్య కళా భవన్ సీపీఐ కార్యాలయం వద్ద శనివారం భారీ సభను ఏర్పాటు చేశారు. మండలంలోని ముచ్చింతాల మరియు అనిగండ్లపాడు గ్రామాల నుండి భారీ స్థాయిలో కమ్యూనిస్ట్ కార్యకర్తలు ర్యాలీ గా తరలి వచ్చారు. పెనుగంచిప్రోలు, ముచ్చింతాల మరియు అనిగండ్ల పాడు గ్రామాల భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ. నూరు వసంతాల ఎంతో ఘనమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని అన్నారు. విద్యార్థి,కార్మిక, రైతు, యువజన, మహిళా సంఘాలను ఏర్పాటు చేసి సమాజ అభివృద్ధికి తోడ్పడిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ యే నని తెలిపారు. అనేక భూ పోరాటాలు చేసి అనేకమంది తెలంగాణ వీర సాయుధ పోరాటానికి మద్దతు తెలపడం ద్వారా వందల మందికి భూమిని పంచిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉందని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఇసుమంత కూడా సహాయం చేయని భారతీయ జనతా పార్టీ మరియు ఆర్ఎస్ఎస్ లు, మహాత్మా గాంధీని చంపిన గాడ్సేలు రాజ్యాన్ని ఏలుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. పంచభూతాలను సైతం ఆదానీ అంబానీల దేశాలుగా మారుస్తున్నారని ఎవరైతే పేద ప్రజల కోసం కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తున్నారో వారి పైన తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని వైజాగ్ లో యువజన కార్మిక సంఘాలపై పిడి యాక్ట్ నమోదు చేయడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. దేశంలో హింస, మతోన్మాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఉత్సాహవంతులైనటువంటి యువత భవిష్యత్తు తరాల్లో భారత కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతంగా చేయడానికి కృషి చేయాలని ఆయన కోరారు. మతతత్వ పార్టీలు, సంఘవిద్రోహ శక్తులు భారత కమ్యూనిస్టు పార్టీని అణిచివేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా సరే వాటిని అధిగమించి పేదల పక్షాన నిలబడి పోరాడుతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సి పి ఐ జిల్లా నాయకులు బుడ్డి రాయప్ప. సీనియర్ సీపీఐ నాయకులు వల్లం కొండ బ్రాహ్మం, మాజీ ఎంపిపి పొన్నం నరసింహారావు, చల్లాల శివాజి ( సిద్ధాంతి ) పద్మాల వెంకటేశ్వరరావు, నంబూరి చలపతిరావు, కనకపుడి బాబురావు,అంబోజి శివాజీ,మాశెట్టి రమేష్ బాబు, షేక్ జానీ, అసదుల్లా, అనిగండ్ల పాడు శర్మ,ఆర్టీసీ మీరా, భోగ్యం నాగులు, షేక్ కరీం, కరిసే మధు, పద్మాల మునసొబు, జక్కులూరి వెంకటేశ్వర్లు, నలగర్ల పెద్ద లింగయ్య,వేల్పుల కాంతయ్య,ఇంటూరి ప్రవీణ్, కటారపు కన్నయ్య, గడ్డం శ్రీనివాసరరావు,నాగే శ్వర రావు, వల్లం కొండ భాస్కర రావు, ముళ్లపాటి వెంకటేశ్వర్లు, రామారావు, కనకపుడి మరియమ్మ, జక్కులూరి వెంకటరావమ్మ, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా కర్ల లింగయ్య కళా భవన్ పై రైతు సంఘం నాయకులు చుండూరు సుబ్బారావు ఎర్ర జెండా ను ఎగురవేయగా, కార్యాయం ముందు అ మర వీరుల స్టూపం పై దో నే పూడి శంకర్ అరుణపతాకాన్ని ఎగురవేసి అమర వీరులకి నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *