పద్మశాలి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు ఘన సన్మానం

★ పద్మశాలియులందరు గ్రామస్థాయి నుండే చైతన్యులై రాజకీయంగా ఎదిగి, గుర్తింపు పొందాలి ★ జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు కొలిపాక సత్తయ్య

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీకాలనీ, జనవరి-4:- ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన ఉమ్మడి కమాన్పూర్ (కమాన్పూర్, రామగిరి) మండలాల పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను అభినందిస్తూ, వారికి ప్రశంస పత్రాలను, పద్మశాలి కులదైవం ఫోటోలు జ్ఞాపికగా అందజేస్తూ, శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. కమాన్పూర్ మండలం రొంపికుంట గ్రామం పద్మశాలి భవనంలో కమాన్పూర్ మండలం పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు, మాజీ సర్పంచ్ కుందారపు బాపు ఆధ్వర్యంలో పెద్దపెల్లి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు కొలిపాక సత్తయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కమాన్పూర్ మండలం సిద్దిపల్లి గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన పద్మశాలీలు బంగారు కళ్యాణి-మహేష్ దంపతులు, నాగారం ఉపసర్పంచ్ గా ఎన్నికైన వొడ్నాల శ్రీనివాస్ లతోపాటు వార్డు సభ్యులుగా ఎన్నికైన రొంపికుంటకు చెందిన కుందారపు కవిత-శ్రావణ్, కొండి అనిల్ కుమార్, గొల్లపల్లికు చెందిన కనుకుంట్ల రాజేందర్, సిద్దిపల్లెకు చెందిన బిల్ల వెంకటేష్, మోర అనూష-ప్రశాంత్, మాటేటి ఐశ్వర్య-అఖిల్, కూర్మ శిరీష-సతీష్, కొలిపాక వెంకన్న, జూలపల్లికి చెందిన వేముల సత్యనారాయణ, బండి శంకర్, రామగిరి మండలం లొంకకేసారం గ్రామానికి చెందిన నామని సారయ్య, బండి లక్ష్మీ-శంకరయ్య, నామని రామ్మూర్తి, పన్నూరుకు చెందిన తన్నీరు ప్రదీప్, కుంట విజయ్, కుమారి గౌడ వైష్ణవి-సత్తయ్య, బండి అరుణ-శ్రీనివాస్, చందనాపూర్ కు చెందిన భోగే రాజయ్య, సుందిళ్లకు చెందిన శ్రీజా-ప్రశాంత్ గార్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. వీరు ఎంచుకున్న రాజకీయ రంగం ద్వారా వారి వారి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైనందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, గ్రామ ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకునేలా, గ్రామ అభివృద్ధికి పనిచేస్తూ, రాబోయే కాలంలో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. వీరందరిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామస్థాయి నుంచి పద్మశాలిలంతా చైతన్యులై, తమ హక్కులను సాధించుకోవడానికి, రాజకీయంగా ఎదిగి, సమాజంలో గుర్తింపు పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, మాజీసర్పంచ్ ఎల్లే రామ్మూర్తి, జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గుండేటి రాజేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు, రొంపికుంట అధ్యక్షులు కూచన మల్లయ్య, రామగుండం కార్పోరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం గౌరవ అధ్యక్షులు మండల సత్యనారాయణ, అధ్యక్షులు చిప్ప రాజేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట లక్ష్మినర్సయ్య, ప్రధాన కార్యదర్శి ఆడెపు శంకర్, పోపా జిల్లా అధ్యక్షులు మాటేటి శంకర్, ఉపాధ్యక్షులు మోర శ్రీనివాస్, ఓదెల మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ పర్శ రమేష్, అంతర్గాం మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు ఎనగందుల శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులు అనుమ లింగయ్య, పద్మశాలి నాయకులు కుందారపు రాములు, బండి రాజనర్సు, బత్తుల సమ్మయ్య, గుండేటి శంకర్, బండి లక్ష్మణ్, రొంపికుంట గ్రామ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కుందారపు శంకర్, నాయకులు గుండేటి శంకరయ్య, గుండేటి శ్రీమూర్తి, తౌట బాలకృష్ణ, పడాల మల్లేష్, కుందారపు సతీష్, శేఖర్, మొండయ్య, మల్లేష్, వెంకటేష్, కొండి శంకర్, సంతోష్, వేముల శ్రీనివాస్, రాంపల్లి రవి, మచ్చ అంజయ్య, కొండి సాయి, మాటేటి దామోదర్, కుందారపు పోచాలు, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.