
పయనించే సూర్యుడు జనవరి 04 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ ఎమ్మిగనూరు లోనే వైఎస్ఆర్ సర్కిల్లో ఆదోని జిల్లా సాధనకై జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 26వ రోజుకు చేరుకున్నాయి దీక్షకు సంఘీభావంగా మాల మహానాడు మహిళా నాయకులు శాంతమ్మ పార్వతమ్మ లక్ష్మమ్మ ఉరుకుందమ్మా లక్ష్మి సావిత్రి దీక్షలో కూర్చోవడం జరిగింది ఈ సందర్భంగా వారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం దీక్షను కొనసాగించడం జరిగింది ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ కరువు వలసలకు విలువైన పశ్చిమ ప్రాంత మహిళ అభివృద్ధి సాధికారత జరగాలంటే అది కేవలం ఆదోని జిల్లా తోనే సాధ్యం అని వారు ఉద్ఘటించారు ఆదోని జిల్లా ఈ ఏర్పడితేనే మహిళల అక్షరాస్యత శాతం పెరిగి బాల్యవివాహాలు సైతం తగ్గి ముఖ్యంగా గ్రామీణ మహిళలకు సుగ్గి భారం తగ్గుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు కనుక కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే ఆదోనిని జిల్లా చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గణేష్ ఉదయ్ ఖాజా కృష్ణ అఫ్రిది రఘు బతకన్నా సత్యన్నా ప్రసాద్ సత్యనారాయణ రెడ్డి ఇతర జేఏసీ నాయకులు పాల్గొన్నారు.