పయనించే సూర్యుడు పాలకొండ జనవరి 4 ప్రతినిధి జీ రమేష్ పాలకొండ డివిజన్లో అత్యున్నత నాయకుడిగా గొప్ప రాజనీతిఘ్నితి కలిగిన గొప్ప రాజకీయ దార్సనకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పాలవలస రాజశేఖర్ మృతి మాకు చాలా బాధనిపించింది. పాలకొండలో గొప్ప నాయకుడిని కోల్పోయాం అని పాలకొండ మాజీ శాసనసభ్యులు పాలవలస విశ్వాసరాయి కళావతి కీర్తిశేషులు పాలవలస రాజశేఖర్ ప్రధమ వర్ధంతి సభలో మాట్లాడటం జరిగింది. తన తండ్రి అంకితభావం సేవ భావం కలిగిన రాజకీయ నాయకుడిగా పాలకొండ డివిజన్లో మంచి గుర్తింపు పొందిన రాజకీయ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా నేను మా నాన్న దగ్గర నుండి ఎన్నో నేర్చుకున్నాను అని పాలవలస విక్రాంతు ఎమ్మెల్సీ తన తండ్రి ప్రధమ వర్ధంతి సభలో ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ మరియు డివిజన్, పరిధిలోని అన్ని మండలాలకు చెందిన వైఎస్సార్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాలకొండ నగర పంచాయతీ కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమమును పాలకొండలగల ఏఎంజీ కన్వెన్షన్ హాల్లో జరిపించారు
