పి ఆర్ టి యు నూతన క్యాలెండర్ 2026ఆవిష్కరణ

పయనించే సూర్యుడు జనవరి 04 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) గోరంట్ల పట్టణ కేంద్రంలోని ఎం ఆర్ సి భవనంలో పి ఆర్ టి యు క్యాలెండర్ 2026 మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం డివై ఈఓ జాన్ రెడ్డప్ప మండల విద్యాధికారి గోపాల్ అధ్యక్షతన జరిగినది ఈ సందర్భంగా విద్యా క్యాలెండర్ 2026 మరియు డైరీ ఆవిష్కరించారు మరియు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించి విద్యార్థులకు న్యాయం చేయాలని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కోరారు అదేవిధంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మహిళ ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మరియు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు లేకుండా అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పి ఆర్ ఆర్ టి యు ఉపాధ్యాయుల సమస్యల పట్ల రాజీలేని పోరాటం చేస్తామని అదేవిధంగా తమ బాధ్యతల పట్ల కూడా సక్రమంగా నడుచుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి డిఎస్ గోపాల్ గౌరవాధ్యక్షులు విద్యాసాగర్ సీనియర్ నాయకులు ఈశ్వర్ రెడ్డి నబీ రసూల్ రంగారెడ్డి దామోదర్ రెడ్డి మరియు మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి మండల బాధ్యులు చంద్రశేఖర్ మోహన్ రెడ్డి మురళి శివారెడ్డి రమేష్ పెద్దారెడ్డి భయ్యా రెడ్డి విజయ్ సురేష్ రాజు రవి నాగేంద్ర రాజారెడ్డి హర్షవర్ధన్ శ్రీధర్ శ్రీనివాసులు సంజీవరెడ్డి సురేష్ కుమార్ శంకర్ రెడ్డి బాబా దిన్ శివ కిష్టప్ప చలపతి వెంకటరెడ్డి కే రమణ సోమిరెడ్డి లక్ష్మిపతి చౌడి రెడ్డి ఈ రామకృష్ణ కృష్ణారెడ్డి విజయ్ గంగిరెడ్డి మహిళా ఉపాధ్యాయులు నర్మదా పర్వీన్ లత జయలక్ష్మి వరలక్ష్మి తేజ వెన్నెల భార్గవి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *