పయనించే సూర్యుడు, జనవరి 4 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) సావిత్రిబాయి పూలే 195 వ జయంతి కార్య క్రమంఏ ఐ ఎఫ్ డి డబ్ల్యూ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఘనంగా జరిపింది శనివారం రోజున సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా ఏ ఐ ఎఫ్ డి డబ్ల్యూ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో వి అనిత అధ్యక్షతన ఎం ఎ నగర్ లో సావిత్రిబాయి పూలే చిత్రపటా నికి ఎ ఐ ఎఫ్ డి డబ్ల్యూ రాష్ట్ర నాయకు లు తాండ్ర కళావతి,పి భాగ్యమ్మ పూల మాలవేసి ప్రారంభించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజం లో ఆడపిల్లలందరూ సావిత్రి బాయి పూలేను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు అదేవిధంగా సమాజం కోసమే జీవించి సమాజం కోసమే మరణించిన వ్యక్తి మాత్రమే సావిత్రిబాయి పూలే అని అన్నారు. సావిత్రిబాయి పూలేను స్త్రీలు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు స్త్రీలను కుటుంబాలకు చెందిన ఆస్తులుగా భౌతిక లైంగిక అవసరాలకు ఆర్థిక ప్రయోజనాలకు ఒక యంత్రంగా మాత్రమే చూసే పరిస్థితులు ఈనాటి సమాజంలో ఉన్నాయని వాటన్నిటిని నిలదొక్కుకొని స్త్రీలు అన్ని రంగాలలో రాణించాలని అదేవిధంగా స్త్రీల జీవన స్థితిగతులు విద్య నేర్చుట ద్వారానే సాధ్య సాధ్యమవుతుంది, అలాగే సావిత్రి బాయి పూలే సమాజంలో ఆ సమతల మీద అలుపెరుగని పోరాటం చేశారని, బడుగు బలహీన వర్గాలకు విద్య వ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భం గా ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధనకు పునరంకితం కావాలని కోరారు. ఈ జయంతి కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు కుంభం సుకన్య, శివాని, ఇంది ర రాణి పుష్పలత సుల్తానా బేగం రజి యా బేగం గీత లక్ష్మీ, అమీనా బేగం, రాణి యువజన సంఘ నాయకులు వనం సుధాకర్, టీ అనిల్ కుమార్, ఇస్లావత్ దశరథ్ నాయక్, డి మధుసూదన్, పల్లె మురళి, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు