బదిలీపై వెళ్తున్న ఆఫీసర్కు ఘన వీడ్కోలు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి /04: నియోజకవర్గం రిపోర్టార్: సాయిరెడ్డి బొల్లం రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపురం గ్రామంలో సర్పంచ్ గన్నేరం వసంత నర్సయ్య ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి సురేష్ రెడ్డి, ఘనంగా వీడ్కోలు పలికారు ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నూతన పాలకవర్గం ఏర్పాటు అయ్యేంతవరకు పెద్దలింగాపూర్ గ్రామ స్పెషల్ ఆఫీసర్ బాధ్యతలు నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి సురేష్ రెడ్డి , ఘనంగా వీడ్కోలు పలికారు అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ సురేష్ రెడ్డి సేవలు గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందు ఉంచడంలో తన శాయశక్తుల కృషి చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి తిరుపతి ,ఉప సర్పంచ్ ఎలవెని రమేష్ వార్డు సభ్యులు గ్రామ పంచాయితీ సిబ్బంది యువకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.