పయనించే సూర్యుడు జనవరి 4 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బర్రె బస్వా రెడ్డి కుటుంబాన్ని ముల్కనూర్ అలిగిరెడ్డి కాశీ విశ్వనాధ రెడ్డి ఇంటర్, డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సుదర్శన్ రెడ్డి శనివారం పరామర్శించారు.. ఈ సందర్భంగా బస్వా రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.. కళాశాల పేరెంట్స్ కమిటీ మెంబర్ గా బస్వా రెడ్డి సేవలందించారు.. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సుదర్శన్ రెడ్డి, ప్రిన్సిపల్ భూపతి శ్రీకాంత్, కళాశాల సిబ్బంది పోలు శ్రీను, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు..
