బాల వికాస వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సమావేశం..

పయనించే సూర్యుడు జనవరి 4 ఎన్ రజినీకాంత్:- భీమదేవరపల్లి మండలం, వంగర గ్రామ ప్రజలకు శుద్ధి చేసిన త్రాగునీరు అందించే లక్ష్యంతో బాల వికాస వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రామ సర్పంచ్ గజ్జల సృజన రమేష్ ఆధ్వర్యంలో స్థానిక పీవీ నరసింహారావు విగ్రహం వద్ద సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాల వికాస ఫెడరేషన్ అధ్యక్షులు కెడం లింగమూర్తి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన త్రాగునీటి అవసరం అత్యంత కీలకమని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా బాల వికాస సంస్థ ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, గ్రామ పంచాయతీ సహకారంతో ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గజ్జల సృజన రమేష్ మాట్లాడుతూ, వంగర గ్రామంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. బాల వికాస సంస్థ సహకారంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు కావడం గ్రామానికి ఎంతో మేలు చేస్తుందని, గ్రామ ప్రజలకు నాణ్యమైన త్రాగునీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గ్రామాభివృద్ధికి సేవా సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు.. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ ఉల్లాల రమేష్, వార్డ్ సభ్యులు గజ్జల రమేష్, రఘునాయకుల మహేష్, శ్రీరామోజు మొండయ్య, మారం సతీష్‌తో పాటు స్థానికులు సుహాసిని, ఉల్లాల ఇందిరా, కొండ తిరుపతి, గిద్ద శ్రీనివాస్, వలి, షేక్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించిన బాల వికాస వాటర్ ప్రోగ్రామ్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, ఫీల్డ్ కోఆర్డినేటర్ కిషన్, రసూల్‌లను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు..