
పయనించే సూర్యుడు జనవరి 4 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ ఈరోజు బిజినపల్లి మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీ విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి మరియు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వేముల సత్యశిల సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మహిళల విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, న్యాయం సాధ్యమని ఆమె నిరూపించారని వక్తలు పేర్కొన్నారు. ఆమె చేసిన సేవలు నేటికీ మహిళలకు, ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో పోషిస్తున్న కీలక పాత్రను కొనియాడుతూ, వారి త్యాగం, సేవాభావానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సావిత్రిబాయి పూలే ఆశయాలైన విద్య, సమానత్వం, న్యాయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వక్తలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దళిత బహుజన నాయకుడు మంగి విజయ్ హాజరై ప్రసంగించారు. అలాగే ఎం.ఎస్.పి జిల్లా అధ్యక్షులు కరిగెళ్ళ దశరథం, మాదిగ మద్దిలేటి, అంతటి రాజేందర్ గౌడ్, బీసీ సంఘం టౌన్ అధ్యక్షుడు గంగానమోని శివ, బీసీ సంఘం గౌరవ అధ్యక్షుడు దాసర్ల వెంకటస్వామి, మండల ప్రధాన కార్యదర్శి జాజల ఆంజనేయులు, భగవంత్ గౌడ్, సంతోష్, వంగ రామన్ గౌడ్, అడ్వకేట్ తిరుపతయ్య, మాజీ జడ్పీటీసీ చినగల్ల పరశురాములు, బంగారి పర్వతాలు, అలోజీ, అబ్బ కరుణాకర్, అల్వాల శ్రీకాంత్ గౌడ్, మైనారిటీ నాయకులు అజీమ్, గఫూర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వివిధ గ్రామాల మహిళా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సావిత్రిబాయి పూలే సేవలను స్మరించుకోవడం ఎంతో సంతోషకరమని పాల్గొన్న నాయకులు అన్నారు.