
పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 4, తల్లాడ రిపోర్టర్ భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టి భారత గడ్డపై నూరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిపిఐ జిల్లా ప్రచార జాత ఈరోజు చల్లాడ మండలానికి చేరింది తల్లాడ మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్మల జితేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ నూరేళ్ల ఈ చరిత్రలో నువ్వు ఎందుకు అలుపెరుగని పోరాటాలు చేసి అనునిత్యం ప్రజల గుండెల్లో ఉన్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలో అనేక రాష్ట్రాలలో సాయిధ పోరాటాలను నిర్వహించి దేశవ్యాప్తంగా సమరశీల పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఉంది ఈ రాష్ట్రమెలినా ఏ ఊరు వెళ్ళిన భారత కమ్యూనిస్టు పార్టీ అడుగుజాడలు కనబడుతూనే ఉంటాయని దానిని చెడపటం ఎవరు తరం కాదని ఆయన అన్నారు ఈరోజు మతోన్మాద శక్తులు కమ్యూనిస్టులపై అనేకమైనటువంటి దాడులు నిర్వహించేటువంటి క్రమంలో ప్రజలు చైతన్యవంతులై ఈ మతోన్మాద ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉందని ఈ జెండాని ఖమ్మం జిల్లా ప్రజలు కడుపులో పెట్టుకొని ప్రేమించారని ఖమ్మం జిల్లా అంటే పోరాటాల కిల్లగా పేరు ఉన్నటువంటి ఈ గడ్డపై దేశవ్యాప్త భారత కమ్యూనిస్టు పార్టీ నూరు వసంతాల ముగింపు సభ జరుగుతుందని ఈ సభకు వేలాదిగా గ్రామ గ్రామాన నుంచి వచ్చి ఒక సభను విజయవంతం చేసి బడుగు బలహీన వర్గాలకు ఇంకా ఆశాజ్యోతి గా ఉన్నటువంటి సిపిఐని మరింత ముందుకు నడపాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సింగ్ నరసింహారావు, సిహెచ్ సీతామహాలక్ష్మి, దండు ఆదినారాయణ, మద్దోజు శ్రవణ్ కుమార్, నల్లమోతు నరసింహారావు, సిపిఐ మండల కార్యదర్శి రమేష్, నియోజకవర్గ మహిళా నాయకురాలు రంజాన్ బి తదితరులు పాల్గొన్నారు