మండలం ఇచ్చే వరకు పోరు

★ ఆగదుఐదో రోజు దీక్షలో గ్రామస్తుల హెచ్చరిక.దీక్షకు మధిర సర్పంచ్ సంఘీభావం

పయనించే సూర్యుడు జనవరి 04 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ పెద్ద హరివాణం గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్షలు శనివారం నాటికి ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మధిర సర్పంచ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి నిరసనకారులకు సంఘీభావం ప్రకటించారు. పెద్ద హరివాణానికి మండలం ఇవ్వడం ఎంతో సమంజసమని, దీనివల్ల ప్రజలకు పరిపాలన సౌలభ్యం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు గ్రామస్తులు తమ పట్టు వీడటం లేదు. మండలం ఇచ్చే వరకు ఎన్ని రోజులైనా సరే ఈ నిరాహార దీక్షను ఆపే ప్రసక్తే లేదని, ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. స్థానికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతును తెలిపారు.