
పయనించేసూర్యుడు మేజర్ న్యూస్ మదనపల్లె అన్నమయ్య జిల్లా జనవరి 04.02.2026 పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) మండల అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పుంగనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పతి కోరారు శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గాజుల రామ్మూర్తి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రానున్న సంక్రాంతి లోపు ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి ఏర్పాటు చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరువేయడంలో అధికారులు ముందుండాలన్నారు అధికారులు ప్రజలకు బాధ్యులుగా పనిచేసి మంచి పేరు తేవాలన్నారు జడ్పిటిసి దామోదర్ రాజు వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి తదితరులు పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకుని వాటిని పూర్తిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇంకా ఎంపీడీవో లీలా మాధవి సర్పంచుల సంఘ అధ్యక్షుడు కృష్ణారెడ్డి సింగల్ విండో చైర్మన్ పగడాల హరిప్రసాద్ రాయల్ వైస్ చైర్మన్ నరసింహులు యాదవ్ అన్ని శాఖలకు చెందిన అధికారులు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు