
పయనించే సూర్యుడు 4.1.2026 పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్. వి రాజశేఖర్ భారతదేశంలో మహిళా విద్య, సామాజిక సమానత్వం మరియు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ధీర వనిత సావిత్రిబాయి పూలే అని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం అంబేద్కర్ విగ్రహం ముందు సావిత్రి భాయ్ పూలే 195 వ జయంతి నిర్వహించడం జరిగింది. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం కల్లేపల్లి అశోక్ మాట్లాడారు తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి భారతదేశంలో మొదటి మహిళా పాఠశాలను ప్రారంభించారు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తారు మరియు స్త్రీ సాధికారతకు మార్గదర్శకురాలిగా నిలిచారాని అన్నారు.కుల వ్యవస్థపై పోరాటం లో కులమత భేదాలు లేని సమాజం కోసం కృషి చేశారు, అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడారు. మహిళల హక్కుల కోసం, వారి సాధికారత కోసం తన జీవితాన్ని అంకిత చేశారు, అన్ని సామాజిక మూస ధోరణులను ఛేదించారు. కులమత భేదాలు లేని సమాజం కోసం కృషి చేశారు, అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడారు. సామాజిక అసమానతలను అంతం చేసి, అందరికీ సమానత్వం సాధించాలనే లక్ష్యంతో సామాజిక విప్లవకారిణిగా మారారు ఆమె స్ఫూర్తితో సామాజిక న్యాయం కోసం అణిచివేత వ్యతిరేకంగా పోరాటాలని పిలుపునిచ్చారు, బిజెపి కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇప్పటికీ స్త్రీల పైన వివక్ష అంటరానితనం దాడులు హత్యలు హత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి దేశంలో కనబడుతుంది కాబట్టి దేశ మహిళ మిత్రులందరికీ సావిత్రిబాయి పూలే గారి పోరాటాన్ని స్ఫూర్తి తీసుకొని మహిళల హక్కుల కోసం రక్షణ కోసం పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో కే వి పి ఎస్. జిల్లా అధ్యక్షులు మోదుంపల్లి శ్రవణ్, సీ ఐ టి యూ. నాయకుడు సెపెల్లీ రవీందర్, అరికిళ్ల రామలక్ష్మి,కుమ్మరి నవీన్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింగం,నర్బ సూరజ్, మధు పాల్గొన్నారు