పయనించే సూర్యుడు జనవరి 4 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామ నూతన సర్పంచ్ గా ఎన్నికైన సృజన రమేష్, ఉప సర్పంచ్ ఒల్లాల రమేష్, వార్డు సభ్యులను స్థానిక మహిళా సమాఖ్య సభ్యులు శనివారం ఘనంగా సన్మానించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు సర్పంచ్ సృజన రమేష్, ఉపసర్పంచ్ ఒల్లాల రమేష్, వార్డు సభ్యులు శ్రీ రామోజు మొండయ్య, గజ్జెల సురేష్ బత్తిని రజిత, కాల్వ అంజలి, మారం సతీష్, రామారాపు స్వరూప, మిడిదొడ్డి తిరుపతి, కండె శారద, వేముల సాధన, రఘు నాయకుల మహేష్, కార్యదర్శి వినయ్ కిరణ్ లను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల నాయకురాళ్లు మాట్లాడుతూ, నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా సర్పంచ్ సృజన రమేష్ మాట్లాడుతూ సన్మానానికి కృతజ్ఞతలు తెలుపుతూ, గ్రామాభివృద్ధిలో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామని, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సీఏలు చెప్యాల కమల, ఏనుక కవిత, మంచాల రజిత, వివో అధ్యక్షులు కడారి మంజుల, నేర్నాల సుమలత మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.