మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలె జయంతి

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 4 పెనుగంచిప్రోలు మండలం ఆనీగీండ్లపాడు గ్రామంలో ని ఈరోజున " ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఎపి.టీ .ఎఫ్ ) పెనుగంచిప్రోలు ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలె జయంతి" ని ఘనంగా నిర్వహించడం జరిగింది. పెనుగంచిప్రోలు మండల భవిత కేంద్రం ప్రిన్సిపాల్ శివపార్వతి ని, సీనియర్ ఉపాధ్యాయురాలు మేచర్ల అంకమ్మ ని ఎపిటీఫ్ జిల్లా నాయకులు శెట్టిపోగు రాము ఘనంగా శాలువా తో సత్కరించారు. ఈ సందర్బంగా జిల్లా నాయకులు శెట్టిపోగు రాము మాట్లాడుతూ విద్య అనేది " ఒక సామాజిక మార్పుకి బలమైన ఆయుధం విద్య మన ఆలోచన విధానాన్ని మార్చి గౌరవంగా జీవించడానికి సహాయపడుతుందని భారతదేశ చరిత్రలో స్త్రీ ఉనికి మనందరికీ తెలిసిందే అటువంటి స్త్రీని ఆకాశం మాకు హద్దు కాదుఅనిరూపించగలిగినటువంటి స్త్రీలు ఎంతమందో మన భారతదేశంలో ఉన్నారని, వారందరికీ మొట్టమొదటి అడుగు, స్ఫూర్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. మొట్టమొదటి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు మహిళల కోసం పాఠశాల స్థాపించినటువంటి ధైర్య సాలి సావిత్రి భాయి పూలే అని విద్యార్థులకు తెలియజేసారు. కార్యక్రమం లో పెద్దలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.