రాష్ట్ర కమ్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా పోతుల వెంకన్న చౌదరి

★ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

పయనించే సూర్యుడు జనవరి : 4 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎస్‌.ఆర్‌. కన్వెన్షన్ హాల్‌లో రాష్ట్ర కమ్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి సమక్షంలో డైరెక్టర్‌లుగా 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం, గండేపల్లి మండలం సింగరంపాలెం గ్రామానికి చెందిన గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల వెంకన్న చౌదరి (మోహనరావు) రాష్ట్ర కమ్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై పోతుల మోహనరావును, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మోహనరావు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆశీస్సులు తీసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్‌గా అంతఃకరణ శుద్ధితో పనిచేస్తూ కమ్మ కులానికి చెందిన పేదల విద్యాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరితో కలిసి కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి మరియు మంత్రివర్యులు నారా లోకేష్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జగ్గంపేట నియోజకవర్గం నుంచి సుమారు 30 కార్లలో మోహనరావు స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు, అలాగే గండేపల్లి మండలం నుంచి కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో విజయవాడకు తరలివెళ్లారు.