పయనించే సూర్యుడు-రాజంపేట న్యూస్ జనవరి 04: విశ్రాంత ఉద్యోగుల జీవన ప్రమాణ పత్రాల సమర్పణ కార్యక్రమం రెండవ రోజూ ముమ్మరంగా కొనసాగింది. ఈ కార్యక్రమం ఈనెల 1వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 28వ తేదీ వరకు కొనసాగనుండగా., పెన్షనర్ల అసోసియేషన్ తాలూకా అధ్యక్షులు పిల్లి పిచ్చయ్య ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం కల్పించి ఈనెల 1వ తేదీ నుండి సబ్ ట్రెజరీ కార్యాలయంలో జీవన ప్రమాణ పత్రాల సమర్పణ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఏ టి ఓ ఆదేశాలతో సబ్ ట్రెజరీ కార్యాలయ సిబ్బంది విశ్రాంత ఉద్యోగులకు ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా పత్రాలు స్వీకరించారు.