రోడ్డు నియమాలను పాటిస్తూ వాహనాలను నడపాలి

★ వాహనాలను తనిఖీ చేస్తున్న బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 4 బోధన్ :రోడ్డు నియమాలను పాటిస్తూ వాహనాలను నడపాలని బోధన్ రూరల్ ఠాణా ఎస్ఐ మచ్చెందర్ రెడ్డి వాహనదారులకు సూచించారు.శనివారం సాలూర శివారులో ఇసుకను తరలిస్తున్న టిప్పర్లు,ట్రాక్టర్లను తనిఖీ చేసి సూచనలు సలహాలు చేశారు.వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను దగ్గర ఉంచుకొని వాహనాలను నడపాలని ఆదేశించారు.లేనియెడల చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.అదేవిధంగా జాగ్రత్తలను పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు.