పయనించే సూర్యుడు న్యూస్ :జనవరి /04: నియోజకవర్గం రిపోర్టార్ :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం ఇల్లంతకుంట : రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసొత్సవాల సందర్భంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో శనివారం విద్యార్థులకు అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండడంతో పాటు జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచించారు. ద్విచక్ర వాహనాలను నడిపేవారు హెల్మెట్ ధరించాలని, కార్ల వాహనదారులు సీటు బెల్టు పెట్టుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్ రూట్ లో వెళ్లకూడదన్నారు. జీవితం అమూల్యమైనదని అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచించారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోయిన వారు అనేకమంది ఉన్నారని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని. 18, సంవత్సరాలు నిండిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పొందిన అనంతరమే తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వాలన్నారు. అధిక వేగం ప్రాణాల మీదికి తెస్తుందని. ఇంట్లో తమకోసం ఎదురు చూసేవారు ఉన్నారని వాహనదారులు గుర్తుంచుకోవాలన్నారు. వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. పాఠశాల స్థాయిలోనే వాహనాలు నడుపుతున్న విద్యార్థులకు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. జిల్లా పరిషత్ పాఠశాల నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో మానవహారంగా ఏర్పడి రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్టిఏ మెంబర్ సంగీతం శ్రీనాథ్, సర్పంచ్ మామిడి రాజు, మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్, ప్రధానోపాధ్యాయిని ప్రేమలత, మోటార్ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్, మోటార్ వాహనాల సహాయ తనిఖీ అధికారులు రజిని, పృథ్వీరాజ్ వర్మల తో పాటు జిల్లా పరిషత్ పాఠశాల, వాణి నికేతన్, వివేకానంద పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.