లట్టుపల్లి గ్రామం లో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195 జయంతి వేడుకలు

*ఘనంగా నిర్వహించిన సర్పంచ్ మారేపల్లి శివలీల చంద్ర గౌడ్

పయనించే సూర్యుడు జనవరి 4 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో ఈరోజు సాయంత్రం అంబేద్కర్ చౌరస్తాలో, భారత దేశ మొట్ట మొదటి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే 195 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మారేపల్లి శివలీల చంద్ర గౌడ్ మాట్లాడుతూ సమాజంలో స్త్రీల కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహనీయురాలు సావిత్రి భాయి ఫూలే అన్నారు. స్త్రీ వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశ్యంతో బాలికల కోసం బడి కట్టించి చదువు చెప్పిన ఏకైక ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి ఫూలే అన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశ్యంతో మహనీయులు సాధించిన పెట్టిన ఫలితాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. అలాంటి మహనీయులు ఆశయ సాధన కోసం ముందుకు పోతూ ప్రతిఒక్కరూ కలిసికట్టుగా గ్రామ అభివృద్ది కోసం పాటు పడుదామని వారు కోరారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ అ నీమూన్ శ్రీకాంత్ వాడు సభ్యులు పాలమూరు జాంగిర్ ముధం శివయ్య యాదవ్ గౌసియా బేగం చంద్రకుమార్ మన్నెం తిమ్మక్క సునీత తిరుపతయ్య మారేపల్లి సత్తెమ్మ మాజీ ఎంపీటీసీ గడ్డం రామచంద్రయ్య గ్రామస్తులు ఇగురంబాద శ్రీనివాసులు గుమ్మకొండ బూశ య్య గంట నాగేందర్ రాజేందర్ గౌడ్ ఈ వెంకటస్వామి పంతుల బాపూజీ జియాజి జంగయ్య గౌడు గుడ్ల సతీష్ టిలేటి శేఖర్ రెడ్డి వర్తవత్ అమర్ నాయక్ మీసేవ కృష్ణ ప్రవీణ్ గుమ్మ కొండా సురేష్ ఎండి హుస్సేన్ ఇమ్రాన్ బురాన్ బ్రహ్మచారి సాగర్ మండల కర్ణాకర్ శివాజీ మహేష్ పి శివకుమార్ శివరాం గుమ్మకొండ రాములు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *