విజయవాడలో వైభవంగా కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రమాణ స్వీకారం

పయనించే సూర్యుడు జనవరి 04 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ విజయవాడలో జరిగిన కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదోనికి చెందిన ప్రముఖ నాయకులు పోలినేని సూర్యనారాయణ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకను పురస్కరించుకుని ఆదోని నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో అభిమానులు, నాయకులు మరియు కార్యకర్తలు విజయవాడకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆదోని నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు భూపాల్ చౌదరి, యువ నాయకుడు మారుతి నాయుడు మరియు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి పాల్గొని పోలినేని సూర్యనారాయణ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదోని ప్రాంత నేతలు మరియు కార్యకర్తల సందడితో ప్రమాణ స్వీకార ప్రాంగణం కోలాహలంగా మారింది. తనకు దక్కిన ఈ గౌరవం పట్ల సూర్యనారాయణ హర్షం వ్యక్తం చేస్తూ, అందరి సహకారంతో కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.