వెల్దండ కేజీబీవీలో సావిత్రిబాయి పూలే 195 జయంతి

★ వెల్దండ కేజీబీవీ ఎస్ ఓ స్రవంతి

పయనించే సూర్యుడు, జనవరి 4 2026, నాగర్ కర్నూలు జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని కేజీబీవీ లో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాపిశెట్టి రామన్న పాల్గొని సావిత్రిబాయి పూలే ఫోటోకి పూలమాలవేసి నివాళులర్పించారు. కేజీబీవీ ఎస్ఓ స్రవంతి మాట్లాడుతూ భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి, కులమత పేదలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి, ఆధునిక విద్య ద్వారానే శ్రీ విముక్తి సాధ్యపడుతుందని, కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా భావించి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషిచేసిన తొలి తరం మహిళ ఉద్యమకారుని, అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో, ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించినా భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా పాఠశాలలు ప్రారంభించిన చదువుల తల్లి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ బృందం ప్రసన్న, సరిత, అమరావతి, ఉమాదేవి, ఉమా, రమా, సుల్తానా, కవిత, అదేవిధంగా విద్యార్థులు ఉన్నారు. కేజీబీవీలో విద్యుత్ సమస్య ఉంది అనగా పాపిశెట్టి రామన్న కేజీబీవీ పాఠశాలకు ఇన్వర్టర్ డొనేట్ చెయ్యాలి అనగా రామన్న, వెంకటేష్ ను స్పందించిగా వెంటనే వెంకటేష్ ఇన్వర్టర్ను ఇప్పియడం జరిగింది. శనివారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇంవేటర్ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీను నాయక్, రమేష్ యాదవ్, విద్యార్థి నలు, తదితరులు పాల్గొన్నారు.