శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ అమ్మవారి & పరశురాముడు దేవాలయ ఆర్చీని ప్రారంభించిన ఎమ్మెల్యే

★ ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ అమ్మవారి పరశురాముడు దేవాలయ ముఖాద్వార ఆర్చీ గేట్ ను గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించినారు.

పయనించే సూర్యుడు తేదీ 4 జనవరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి బోయ కిష్టన్న. ముందుగా ఎమ్మెల్యే కి ఆలయ కమిటీ చైర్మన్ దంపతులు వెంకట్రాములు పూలగుచ్చంతో, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు శ్రీ జమ్ములమ్మ అమ్మవారి దేవాలయం నందు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులను పొందడం జరిగింది ముందుగా గంగాధర్ గౌడ్ సహకారంతో నిర్మించిన జమ్ములమ్మ అమ్మవారి విగ్రహంకు, మండపానికి పూజలు చేసి ప్రారంభించారు. వేణుగోపాల్ సోదరుల ఆధ్వర్యంలో దేవస్థానానికి నిర్మించిన ఆలయ ముఖద్వారానికి పూజలు నిర్వహించి ప్రారంభించారు. దేవాలయ ధాతల ఆధ్వర్యంలో దేవస్థానానికి నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ పనులకు భూమి పూజచేసి పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నడిగడ్డ భక్తులే కాకుండా కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంత భక్తులు కొలిచే ఇలావేల్పు జమ్మిచేడు శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ పరుశరామ స్వామి దేవస్థాన అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఆలయ అభివృధి కోసం ధాతల ద్వారా, ప్రభుత్వం ద్వారా కావలసిన అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి కృషిచేస్తానని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచడానికి నా వంతు కృషి చేస్తుంటానని, అమ్మవారి చల్లని చూపు ఎల్లవేళలా ప్రజల పై ఉండాలని ఈ ప్రాంత అభివృద్ధికి అమ్మవారి కరుణ ఉండాలని మనస్ఫూర్తిగా కొలిచానని, భవిష్యత్తులొ కూడ ఆలయ అభివృద్ధి నిరంతరం కొనసాగే విదంగా చూస్తానని, దేవాలయ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆలయం కమిటీ డైరెక్టర్స్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.