సర్పంచ్,ఉప సర్పంచ్, లకు మిత్రుల సన్మానం

పయనించే సూర్యుడు న్యూస్ : పెద్దపల్లి, జనవరి-04:- ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాల్వ శ్రీరాంపూర్ మండలం చిన్న రాత్ పల్లి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన ఓల్లాల శ్రీనివాస్ అలాగే ఆశన్నపల్లె గ్రామ ఉప సర్పంచ్ గా ఎరుకల మల్లయ్య గెలిచిన సందర్భంగా చిన్ననాటి మిత్రులు వారిని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా మిత్రులు సర్పంచి ఓల్లాల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎరుకల మల్లయ్య, ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం డైరెక్టర్ గా కొండ శ్రీనివాస్, బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని, వారు ఇంకా రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో బూర్ల తిరుపతి, చిట్టంపల్లి సత్యనారాయణ, కలవేన రమేష్, రేబెల్లి విజయ భాస్కర్, బండారు తిరుపతి, నూనేటి శ్రీనివాస్, వల్లాల శ్రీనివాస్,పాల్గొన్నారు.