సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాలి

★ బిజినపల్లి మండల ఎంపీడీవో కథలప్ప

పయనించే సూర్యుడు జనవరి 4 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలంలో ఇటీవల నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులందరూ తమ ఎన్నికల ఖర్చుల వివరాలను తప్పనిసరిగా సమర్పించ వలసిందిగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం సూచించింది. మండల ప్రజా పరిషత్ కార్యాలయం, బిజినపల్లి నందు తేదీ 03 జనవరి 2026 నుంచి 06 జనవరి 2026 వరకు కార్యాలయ పనిదినాలలో ఖర్చుల వివరాలను సమర్పించాల్సిందిగా బిజినపల్లి మండల ఎంపీడీవో కథలప్ప తెలిపారు. నిర్దేశిత గడువులో ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించని అభ్యర్థులు తదుపరి జరుగు ఎన్నికలకు అనర్హులుగా పరిగణించబడతారు అని ఆయన పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.