సాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రత మాసోత్సవాలు

★ ట్రాఫిక్ రూల్స్ ను విద్యార్థులకు వివరిస్తున్న బోధన్ ఎంవీఐ శ్రీనివాస్

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 4 బోధన్ : సాలూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో రోడ్డు రవాణా శాఖ వారి మసోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బోధన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి మద్యం సేవించి వాహనం నడపరాదు.హెల్మెట్ ధరించి వాహనం నడిపించాలి అని ట్రాఫిక్ నియమ నిబంధనలను వివరించారు. రోడ్డు మీద ఉండే చిన్నారులకు వాటి అర్థాలను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజీ మంజుషా మాట్లాడుతూ చిన్న వయసులో ట్రాఫిక్ నియమాలు తెలుసుకొని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు వాటి కారణాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో బోధన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, మణికంఠ పాఠశాల ఉపాధ్యాయులు గంధం సాయిలు , కాంబ్లే విట్టల్, రాజ్ కుమార్, విజయ్ కుమార్, అబ్బయ్య, అరుణ్ కుమార్, లక్ష్మీ ,రవాణా శాఖ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.