సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నివాళులు

పయనించే సూర్యడు /జనవరి 04 / కాప్రాప్రతినిధి సింగం రాజు : సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బిఆర్ఎస్ ఉద్యమకారుడు బండి మోహన్‌తో పాటు పలువురు ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహిళా విద్యకు ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సావిత్రిబాయి పూలే సామాజిక వివక్షను ఎదుర్కొని విద్య ద్వారా సమాజాన్ని మార్చిన మహానీయురాలని వారు కొనియాడారు. ఆమె చూపిన మార్గంలో నడుచుకుంటూ సమానత్వం, విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *