సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం ఇళ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో

పయనించే సూర్యుడు జనవరి 04 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం, కౌండిన్య నగర్ లో సావిత్రిబాయి పూలే పార్క్ నందు ఆధునిక భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయిని శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇళ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలవేసి పుష్పాలతో అంజలి ఘటించి, విగ్రహ ప్రదాత మట్టపర్తి రజిని మురళీకృష్ణ (మాజీ కౌన్సిలర్) దంపతులకు దుస్సాలు వాతో సత్కరించి, ఇళ్ల సత్యనారాయణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్య పడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్ట మొదటగా బాలికలకు పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని మననం చేసుకున్నారు.. ఈ కార్యక్రమంలో మోకా సుబ్బారావు, ఎల్లన్న శకుంతల, డా||. రాయుడు శ్రీరామచంద్రమూర్తి, డా||. మట్టపర్తి సుధా, చిలకమర్రి కస్తూరి, మోకా ఆదిలక్ష్మి, బొంతు శివాజీ, నల్ల సత్తిబాబు, కట్టా నారాయణమూర్తి, కట్టా జనార్దన్ రావు, దాట్ల సుబ్బరాజు, కముజు శ్రీనివాసరావు దంపతులు, పేరా బత్తుల సుబ్బారావు, గున్నేపల్లి భీమశంకర్ వీరభద్ర శర్మ, నల్లా వెంకట గోపాలకృష్ణ, నరసింహ శాస్త్రి మరియు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *