పయనించే సూర్యుడు జనవరి 04 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ ఆదోని డివిజన్ బీ.సీ. ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు అధ్యక్షతన హోటల్ భీమాస్ ఫంక్షన్ హాల్ నందు సావిత్రిబాయి పూలే 195 వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటం నకు బీ.సీ. నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి నినాదాలతో సావిత్రిబాయి ఆశయాలు కొనసాగించాలని నినందించడం జరిగింది. బీ.సీ. నాయకులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3వ తేదీన మహారాష్ట్ర లో జన్మించారు ఆమె భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా తాను విద్య నేర్చుకుని మహిళలకు చదువు నేర్పించే మొట్టమొదటిసారి మహిళ ఉపాధ్యాయురాలుగా అవతరించింది, సంఘసంస్కర్త, కవయిత్రి, మరియు మహిళ,విద్యకు సామాజిక న్యాయానికి సామాజిక సమానత్వానికి కృషిచేసిన మహానీయురాలు ఆమె, జన్మస్థలం నైగావ్,మహారాష్ట్ర,ఆమె పాత్ర,మహిళా విద్యకు అణగారిన అంటరానివారికి ఎంతో తోడ్పాటు అందించింది. కుల మత భేదాలు లేని సమాజాని కోసం పాటుపడింది భారతదేశంలోనే బాలికల విద్యకు అంటరాని ప్రజలకు విద్యను అందించిన మహానీయురాలు, ఆ మెను,స్మరించుకోవడానికి ఆమె వారసత్వాన్ని, ఆమె ఆశయాలను గౌరవించుకోవడం ఎంతో ఉన్నతమైనది. దేశవ్యాప్తంగా ఆమె జయంతి ఉత్సవాలు నేడు అణగారిన వర్గాల కులాల ప్రజల జాతుల సాంస్కృతి ప్రాంతీయ, అసమానుతల ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలోజిల్లా గౌరవ అధ్యక్షులు పి సాయి బాబా, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ దేవిశెట్టి ప్రకాష్, కత్తి హనుమంతరావు, తాలూకా అధ్యక్షులు మరియాని చెన్న బసప్ప,పట్టణ అధ్యక్షులు హెచ్ వీరేష్, ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ (దళిత బహుజన శ్రామిక విముక్తి )జాతీయ కార్యదర్శి పగడాలకోదండ, పట్టణ గౌరవ సలహాదారులు బి మల్లేశ్వరప్ప, ఎం వీరభద్ర, బెస్త ప్రకాష్, తోన్ పే తాయప్ప, కత్తి ప్రసాద్, జి నల్లారెడ్డి, తదితరులు పాల్గొని ప్రసంగించారు.