
పయనించే సూర్యుడు జనవరి 4 కరీంనగర్ న్యూస్ : జెడ్ పి ఎచ్ ఎస్ పి ఎస్ గోపాలరావుపేట మహిళా ఉపాధ్యాయులు వనితరాణి ఇంచార్జ్ ఎచ్ ఏం రత్నప్రభ గంగా స్రవంతి జయశ్రీ రేణుక గార్లకు గోపాల్ రావుపేట్ మాజి ఎంపీటీసీ సర్పంచ్ కరీంనగర్ జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న వెంకటరాం రెడ్డి శాలువాలతో ఘనంగా సత్కరించారు. సత్యప్రసన్న మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయురాలు గానే కాక మహిళా విద్యకు,సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి గా నిలిచారు, ప్రతి విద్యార్థి ఆమె పోరాటాలను మార్గ దర్శకంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గోపాల్రావుపేట 2 వ వార్డు మెంబర్ నేరెళ్ల కవితా రాజ యువజన సంఘాల నాయకులు బాపు రాజు బాబు సంజయ్ రాజశేఖర్ అంజయ్య రమేష్ కిట్టు దత్తు తిరుపతి తదితరులు పాల్గొన్నారు
